ఇటీవల కాంతారా మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవడంతో పాటు ఆ మూవీలో అద్భుత నటన కనబరిచినందుకు గాను ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు నటుడు కం దర్శికుడైన రిషిబ్ శెట్టి. తాజాగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆయన భారీ మైథలాజికల్ మూవీ జై హనుమాన్ లో హనుమంతుని పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కాంతారాకు సీక్వెల్ అయిన కాంతారా ది లెజెండ్ లో కూడా నటిస్తున్నారు రిషిబ్ శెట్టి. ఈ రెండు సినిమాలపై అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇక లేటెస్ట్ గా చత్రపతి శివాజీ బయోపిక్ లో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్, ది ప్రైడ్ అఫ్ భారత్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని మేరీకోమ్, సర్బ్‌జిత్, వీర్ సావర్కర్, రామ్‌లీలా, సర్బ్‌జిత్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సందీప్ సింగ్, సఫేద్ అనే షార్ట్ ఫిల్మ్‌తో పాటు గ్రాండ్ లెవెల్లో రూపొందించనున్నారు.
బాలీవుడ్ అభిమానులు శివాజీ మహారాజ్‌ను ఎప్పుడూ దేవుడిగా భావిస్తారు మరియు వారు ఆయన పై తీసే బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఛత్రపతి శివాజీ లుక్ లో రిషబ్ శెట్టి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 21 జనవరి 2027న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. మొత్తంగా ఈ మూడు సినిమాలతో నటుడిగా రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా ఆడియన్స్ మనసు చూరగొనేందుకు సిద్ధమయ్యారు. కాగా ఇవి ఆయనకు మరింత క్రేజ్ తీసుకురావాలని కోరుకుందాం.