కన్నడ స్టార్ నటుడు కం దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా ఇటీవల తెరకెక్కిన మైథలాజికల్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ కాంతారా. ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, మనసి సుధీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
అందరి నుండి మంచి అంచనాలతో రిలీజ్ అయిన కాంతారా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. ఆ మూవీలో అద్భుత నటనకు గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక దానికి సీక్వెల్ గా హోంబలె ఫిలిమ్స్ సంస్థ మరింత గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోన్న మూవీ కాంతారా ఏ లెజెండ్. ఈ మూవీ పై కన్నడతో పాటు దేశవ్యాప్తంగా అందరిలో మరింతగా క్రేజ్ ఉంది.
ఇక ఈ పాన్ ఇండియన్ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోంది. కాగా తమ మూవీని వచ్చే ఏడాది గాంధీ జయంతి కానుకగా 2025 అక్టోబర్ 2న గ్రాండ్ గా పలు బాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. కాంతారా మూవీ తెలుగులో కూడా అద్భుతంగా కలెక్షన్ రాబట్టడంతో కాంతారా ఏ లెజెండ్ పై ఇక్కడి ఆడియన్స్ లో కూడా బాగా క్రేజ్ ఏర్పడింది.