Homeసినిమా వార్తలుపోస్ట్ పోన్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన 'కాంతారా' టీమ్

పోస్ట్ పోన్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ‘కాంతారా’ టీమ్

- Advertisement -

రెండున్నరెళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చి అతిపెద్ద విజయం అందుకున్న పాన్ ఇండియన్ సినిమా కాంతారా. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో కూడా అతిపెద్ద విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న తాజా సినిమా కాంతారా ఏ లెజెండ్.

దీనిపై అందరిలో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటుండగా దీనిని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ టీజర్ లో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది.

అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా కొన్నాళ్లపాటు వాయిదా పడనుందని ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దానితో కాంతారా ఏ లెజెండ్ టీమ్ స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టింది. కాగా తమ సినిమా అనుకున్న విధంగా అక్టోబర్ 2న పక్కాగా దేశవ్యాప్తంగా పలు భాషల యొక్క ఆడియన్స్ ముందుకు రావడం ఖాయమని ఎటువంటి పోస్ట్పోన్మెంట్ లేదని తెలిపారు.

READ  'ఛావా' ఓటిటి : డిజప్పాయింట్ అయిన సౌత్ ఆడియన్స్

అందుతున్న సమాచారం ప్రకారం కాంతారా పార్ట్ 1 మించి ఎంతో భారీ స్థాయిలో గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తప్పకుండా రిలీజ్ అనంతరం కాంతారా ఏ లెజెండ్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయం ఖాయమని అంటున్నాయి కన్నడ సినీవర్గాలు. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories