కన్నడ ప్రేక్షకుల్లో ఒక వర్గం ఎప్పుడూ రష్మిక పై ఒక అవేశపూరితమైన పగతో ఉంటారు. అందుకు కారణాలు రకరకాల విషయాలతో ముడిపడి ఉండవచ్చు. అయితే వాటిలో ఒక ప్రధాన కారణం మాత్రం.. కన్నడ సినిమాల రష్మిక పట్ల సామాజిక మాధ్యమాల్లో ఆమె మౌనంగా ఉండటమే అంటున్నారు.
నిజానికి రష్మిక ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చురుకుగా ఉన్నప్పటికీ.. ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించిన కాంతార యొక్క భారీ విజయాన్ని ఆమె కనీసం నామమాత్రంగా కూడా ప్రశంసించలేదు. కాంతార సినిమా పట్ల ఆమె మౌనం ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
రష్మిక కన్నడను మరిచిపోయిందని కొందరు రిషబ్ శెట్టి అభిమానులు వాదిస్తున్నారు. కాంతార చిత్రం అంతలా భారీ స్పందన మరియు మంచి సమీక్షలను అందుకుని మరియు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని కూడా అందుకుంది.
సాధారణంగా ఇలాంటి విజయాలు వచ్చినపుడు స్టార్ హీరో లేదా హీరోయిన్లు ఆయా సినిమా టీమ్‌లకు తమ వంతుగా అభినందనలు తెలుపుతూ క్రమం తప్పకుండా ట్వీట్ చేస్తారు. రష్మిక కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇదివరకు వేరే సినిమాలకు అలానే చేశారు.
కానీ కాంతార పై మాత్రం రష్మిక మౌనం వహించడానికి చాలా బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి స్నేహితుడు రక్షిత్ శెట్టితో గతంలో రష్మిక నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే వారి వ్యక్తిగత కారణాల వల్ల తర్వాత వారికి పెళ్లి జరగలేదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని.. రష్మిక ప్రణాళికా బద్ధంగా కాంతార పట్ల మౌనంగా ఉండటానికి వ్యక్తిగత విభేదాలే కారణమని కన్నడ పరిశ్రమలో చాలా మంది భావిస్తున్నారు.
రష్మికకు ఇలాంటి ఆరోపణలు కొత్త కాదు. కర్ణాటకలోని ఒక వర్గం నెటిజన్లు రష్మికపై ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. వారు ఆమె విజయం పట్ల గర్వపడడం లేదు. బయటి వ్యక్తి అంటూ ఆమెను దూరం పెడుతున్నారు. ఇలా చేస్తున్న మీమ్స్ మరియు ట్రోల్‌లకు కూడా కొంత స్పందన వస్తోంది. ఇటీవలే తనను టార్గెట్ చేసిన వారి ద్వేషానికి వ్యతిరేకంగా రష్మిక బహిరంగ లేఖ కూడా రాసింది.
సినీ తారలు, ముఖ్యంగా హీరోయిన్లు తరచూ ఇలాంటి ట్రోలింగ్‌ల రూపంలో దుర్భాషలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఇష్టానుసారంగా అనుచితంగా కామెంట్లు చేయకుండా నెటిజన్లు కాస్త సంయమనం పాటిస్తే మంచిది. సినిమాల్లో నటన గురించో మరియు ఆఫ్-స్క్రీన్ ప్రవర్తన గురించో ఒక ఆరోగ్యకరమైన విమర్శ ఎల్లప్పుడూ మంచి స్పందన తెచ్చుకుంటుంది. కానీ స్వార్థ ప్రయోజనాలతో ఫలానా నటి మాకు నచ్చలేదు కాబట్టి ఆమెను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాము అనడం ఎంత మాత్రం సబబు కాదు.