Homeసినిమా వార్తలుKanguva Trailer అంచనాలు అందుకోని 'కంగువ' ట్రైలర్

Kanguva Trailer అంచనాలు అందుకోని ‘కంగువ’ ట్రైలర్

- Advertisement -

కోలీవుడ్ స్టార్ నటుడు వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ పై మొదటి నుండి సూర్య ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, ఒక సాంగ్ అంచనాలు విపరీతంగా పెంచగా నేడు కొద్దిసేపటి క్రితం కంగువ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ముఖ్యంగా ట్రైలర్ లో విజువల్స్, గ్రాఫిక్స్ హీరో సూర్య, విలన్ బాబీ డియోల్ లుక్స్, స్టైల్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భారీ యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ ఇది వర్తమాన మరియు చారిత్రక భాగాల కలయికని ఇప్పటికీ చారిత్రాత్మక భాగాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇటీవల బృందం తెలిపింది.

కొన్నిసార్లు సరైన అంచనాలను సెట్ చేయకపోవడం చాలా చెడుగా ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి ఇలాంటి సినిమాలకు ప్రేక్షకులను సిద్ధం చేయాలి. కానీ మాస్ ట్రైలర్ మాత్రం కచ్చితంగా పెద్ద ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుంది. ఇక ఈ ట్రైలర్ కార్తీ పై తీసిన లాస్ట్ షాట్ చాలా బాగుంది, ఇది 2వ భాగానికి దారితీయవచ్చు. మొత్తంగా కంగువ ట్రైలర్ ఆశించిన స్థాయి రెస్పాన్స్ అయితే అందుకోలేదని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో ఓకే అనిపించే స్థాయి వ్యూస్ లభిస్తున్నాయి. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

READ  Prabhas New Movie ప్రభాస్ - హను మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories