కోలీవుడ్ వెర్సటైల్ సెన్సేషనల్ యాక్టర్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ అన్ని కూడా మరింతగా హైప్ ఏర్పరిచాయి.
అయితే నవంబర్ 14న తెలుగు, తమిళ్ తో పాటు పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న తమ హీరో కంగువ సూపర్ హిట్ ఖాయం అని సూర్య ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా వెట్రి పళనిస్వామి ఫోటోగ్రఫి అందించారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, కంగువ మూవీ తెలుగులో రూ. 100 కోట్ల మేర షేర్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.
దానికి కారణం సూర్యకి తెలుగులో మంచి క్రేజ్ ఉండడంతో పాటు ఈ మూవీ బాగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడం. గతంలో రజినీకాంత్ 2.0, జైలర్, వంటి సినిమాలు భారీగా కలెక్షన్ అందుకున్నాయి. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ రూ. 100 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఆ విధంగా కంగువ లో కంటెంట్ కరెక్ట్ గా ఉండి అంచనాలు అందుకుంటే తప్పకుండా అది కూడా ఈ ఫీట్ ని చేరుకునే ఛాన్స్ కనపడుతోంది. మరి కంగువ ఆ స్థాయికి చేరుకుంటుందా లేదా అనేది చూడాలి.