కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ నేడు భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి వచ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. విషయంలోకి వెళితే మూవీకి ఓవరాల్ గా ఆడియన్స్ నుండి పర్వాలేదనిపించే రెస్పాన్స్ అయితే లభిస్తోంది.
ముఖ్యంగా సూర్య వన్ మ్యాన్ షో పెర్ఫార్మన్స్ మాత్రమే మూవీలో బాగుంది. ఇక యాక్షన్ సీన్స్ అక్కడక్కడా పర్వాలేదనిపించినప్పటికీ కథ, నడిచే కథనంలో అనేక లోపాలున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ పర్వాలేదనిపించిన కంగువ సెకండ్ హాఫ్ చాలా వరకు డ్రాగ్ అయింది. ఎక్కడా కూడా ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు లేవు. ముఖ్యంగా కథనం ఊహాజనితంగా ఉండడంతో పాటు కొన్ని ఎపిసోడ్స్ అయితే పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయి.
సూర్య ఫ్యాన్స్ కి మాత్రం ఈ మూవీ అక్కడక్క కొంత మెప్పించవచ్చు. నార్మల్ ఆడియన్స్ ఐతే నిరాశచెందుతారు. గ్రాండియర్ విజువల్స్, సూర్య యాక్టింగ్, భారీ నిర్మాణ విలువలు మాత్రమే ఈ మూవీలో బాగున్నాయి. మొత్తంగా అయితే ఎన్నో అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన కంగువ అందరినీ నిరాశపరిచింది. కాగా ఈ మూవీ ఓపెనింగ్స్ పరంగా బాగానే దక్కించుకునే అవకాశం కనపడుతున్నప్పటికీ బ్రేకీవెన్ అందుకోవాలంటే రూ. 400 కోట్ల గ్రాస్ రాబట్టాలి. మరి ఈ మార్క్ ని కంగువ ఎంతవరకు చేరుకుంటుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్ : –
- కంగువగా సూర్య యాక్టింగ్
- భారీ నిర్మాణ విలువలు
- సినిమా మెయిన్ పాయింట్
మైనస్ పాయింట్స్ :-
- స్లో నేరేషన్
- సెకండాఫ్ లో డల్ స్క్రీన్ ప్లే
- భావోద్వేగ కనెక్షన్ లేకపోవడం
- దేవిశ్రీ నేపథ్య సంగీతం
రేటింగ్ : 2.25 / 5