మన టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్. ఈ సినిమాపై ప్రభాస్ గారి అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టీజీ విశ్వప్రసాద్ అలానే వివేక్ కూచిబొట్ల గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ది రాజా సాబ్ ఓల్డ్ లుక్ మోషన్ పోస్టర్ మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఈ మూవీని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నారు. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో లోకనాయకుడు కమలహాసన్ హీరోగా రూపొందుతోన్న భారీ మూవీ థగ్ లైఫ్. దీనిపై కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. కెరీర్ పరంగా చాలా ఏళ్ల తర్వాత మణిరత్నంతో కలిసి కమల్ చేస్తున్న మూవీ కావటంతో ఇది కూడా బ్లాక్ బస్టర్ కొడుతుందని కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా భావిస్తున్నారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం థగ్ లైఫ్ మూవీ కూడా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందని అంటున్నారు. మరి ఇదే కనక నిజమైతే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ తో పాటు కమలహాసన్ మధ్య భారీ పోరు జరిగే అవకాశం ఉంది. మరి పక్కాగా కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందో లేదో తెలియాలి అంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అందించే వరకు ఆగాలి.