పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన కల్కి రిలీజ్ అనంతరం భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇందులో కీలక పాత్రలు చేసారు. ఇక కల్కి థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ పూర్తి అయినట్లే అని చెప్పాలి. ఇక ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ కోసం ఆడియన్స్ అందరూ ఎంతో ఎదురుచూస్తుండగా తాజాగా దీనికి సంబంధించి అప్ డేట్ లభించింది.
కాగా కల్కి 2898 ఏడి మూవీ ఆగష్టు 23న ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు రానుందని స్పష్టమైంది. అయితే ముందుగా ఓటిటిలో తెలుగు భాషలో అందుబాటులోకి రానున్న కల్కి, ఆ తరువాత మిగతా భాషల్లో కూడా రిలీజ్ కానుంది. కాగా కల్కి 2898 ఏడి హిందీ ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా దానిని రిలీజ్ డీటెయిల్స్ కూడా స్పష్టం కావాల్సి ఉంది