యువ నటుడు కిరాణ్ అబ్బవరం కెరిర్ పరంగా ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లతో నటుడిగా తనకంటూ మంచి పేరుతో ఆడియన్స్ నుంచి మెప్పు అందుకుని ముందుకు కొనసాగుతున్నారు. ఇక ఆయన హీరోగా తాజాగా యువ దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ క. ఈ సినిమా నుండి మొదట రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి ఇంట్రెస్ట్ ఏర్పరిచింది.
ఆ తరువాత సాంగ్స్ గాని టీజర్ అలానే థియేట్రికల్ ట్రైలర్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తూ వచ్చాయి. ఇక నిన్న దీపావళి పండుగ కానుకగా క సినిమా గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ డే ప్రీమియర్స్ నుంచే మంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకున్న క మూవీ థియేటర్ రైట్స్ మొత్తంగా 12 కోట్లకు అమ్ముడు అయింది. అలానే బ్రేకీవెన్ కి 25 కోట్ల రాబట్టాల్సి ఉంది.
ఇక ఫస్ట్ డే చూసుకుంటే దాదాపుగా 20% ఈ సినిమా కలెక్షన్ రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం పెర్ఫార్మన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు, ఆకట్టుకునే కథ, కథనాలకి ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ లభిస్తోంది. డే 2 కూడా అనేక ఏరియాల్లో క కు బాగా కలెక్షన్ లభిస్తోంది. ఆడియన్స్ ని చాలా వరకు ఎంగేజ్ చేస్తూ సాగిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోయే రోజుల్లో ఎంతమేర రాబడుతుందో చూడాలి