ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన క తోపాటు మరొక యువ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లక్కీ భాస్కర్ విజయవంతం అయ్యాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై లక్కీ భాస్కర్ మూవీ రూపొందింది.
దీనిని వెంకీ అట్లూరి తెరకెక్కించారు. ఇక క మూవీని యువ దర్శక ద్వయం సుజిత్, సందీప్ తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలు రెండు కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి. కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఆద్యంతం ఆకట్టుకునే కథ కథనాలతో దీన్ని దర్శకకులు తెరకెక్కించారు. ఇక మరోవైపు లక్కీ భాస్కర్ మూవీ క్రైమ్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా రూపొంది అన్ని వర్గాలను అలరించింది.
మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్ గా నటించారు. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు అందించిన ఈ రెండు సినిమాలు నేడు ఓటిటి ఆడేన్స్ ముందుకు రానున్నాయి. కాగా వీటిలో క మూవీ ఈటీవీ విన్ ద్వారా అలానే లక్కీ భాస్కర్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఆడియన్స్ ముందుకు రానున్నాయి. మరి థియేటర్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ రెండు సినిమాలు ఎంత మేడం ఓటిటిలో స్పందన అందుకుంటాయో చూడాలి.