టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో సైఫ్ ఆలీ ఖాన్, శ్రీకాంత్, గెటప్ శ్రీను తదితరులు నటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన దేవర మూవీ ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ఆ అంచనాలు మరింతగా పెంచేసిందని చెప్పాలి.
ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది దేవర మూవీ. విషయం ఏమిటంటే, నేడు నిర్వహించిన ఈ మూవీ యొక్క కోలీవుడ్ మీట్ లో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, తప్పకుండా దేవరకు తమిళ ఆడియన్స్ యొక్క మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
అయితే డైరెక్ట్ గా కోలీవుడ్ మూవీలో ఎప్పుడు నటిస్తారు అంటూ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ, వెట్రిమారన్ సార్ ఓకె అంటే తమిళ సినిమా చేసి దానిని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడానికి సిద్ధం అన్నారు. దీనిని బట్టి రాబోయే రోజుల్లో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో ఒక పవర్ఫుల్ మూవీ వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.