Homeసినిమా వార్తలు100 కోట్ల షేర్ క్లబ్ లో చేరబోతున్న ఎన్టీఆర్ 

100 కోట్ల షేర్ క్లబ్ లో చేరబోతున్న ఎన్టీఆర్ 

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్దము అవుతోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కించారు. 

ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు కలిగిన దేవర తప్పకుండా సక్సెస్ అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీని నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ భారీ స్థాయిలో నిర్మించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా విలన్ గా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. 

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీతో ఎన్టీఆర్ కెరీర్ పరంగా రూ. 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. 2018లో త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత మూవీతో రూ. 88 కోట్ల షేర్ అందుకున్న ఎన్టీఆర్ తప్పకుండా దేవర తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్ పరంగా సోలోగా బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకుని తీరుతారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి దేవర ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి. 

READ  Can they Damage Pushpa 2 'పుష్ప - 2' : వాళ్ళ వల్ల నిజంగానే డ్యామేజ్ జరుగుతుందా ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories