ఎంపైర్ మ్యాగజైన్ అనేది బ్రిటిష్ వారి ప్రముఖ మాసపత్రిక. ఇందులో సంచలనం సృష్టించిన మరియు సంవత్సరంలో గమనించదగ్గ ప్రభావం చూపిన చలనచిత్రాలను కవర్ చేస్తూ వార్షిక సమీక్ష అని పిలువబడే దాని ప్రత్యేక సంచికను విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం ఎడిషన్‌లో, తెలుగు సినిమా RRR ఈ అరుదైన ఘనత సాధించిన అతి కొద్ది సినిమాలలో ఒకటిగా నిలిచింది.
ఆ పత్రికపై వచ్చిన కథనంలో ఎన్టీఆర్ పులి పై గర్జించే పోస్టర్ ఉంది. తమ అభిమాన తార అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు ఈ తరుణంలో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు.
పాశ్చాత్య ప్రేక్షకులు RRR సినిమాని విశేషమైన స్థాయిలో అదరించడం వల్ల RRR నిరంతరం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంపైర్ కథనంలో రాజమౌళి ఇంటర్వ్యూ ప్రతిస్పందనల చిన్న వీడియోలలో సినిమా కోసం చిత్ర బృందం ఎంత బాధ మరియు శ్రమ పడింది, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాలు కూడా ఉన్నాయి.
రాజమౌళి ప్రకారం, వెస్ట్‌లో RRR భారీ విజయానికి రెండు కారణాలు, OTTలో ఇతర భాషా చిత్రాలకు మార్కెట్‌ని సృష్టించడం మరియు హీరోయిజంతో అనూహ్యమైన యాక్షన్ సన్నివేశాల వల్లే RRR కు అంత పేరు వచ్చిందని ఆయన అన్నారు. ప్రస్తుతం జపాన్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది.
ఎన్టీఆర్, చరణ్‌లు నటించిన ఈ సినిమా మంచి గుర్తింపుతో పాటు, బాక్సాఫీస్ పరంగా వారి కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచింది. RRR సినిమాతో వారు 1000 కోట్ల క్లబ్‌లో చేరారు మరియు ఈ రకమైన ప్రతిష్టాత్మక పత్రికలలో ప్రదర్శింపబడే అవకాశాన్ని పొందారు.
తమ అభిమాన హీరో ఇలాంటి ప్రఖ్యాత మ్యాగజైన్‌లో పోస్టర్ బాయ్‌గా రావడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ప్రత్యేకంగా సంతోషిస్తున్నారు. అయితే ఎవరు ఎవరి పై ఆధిపత్యం చెలాయిస్తున్నారనే విషయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ హీరోల అభిమానుల మధ్య చాలా రకాల గొడవలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవలు ఇప్పుడప్పుడే కాదు ఎప్పటికీ ముగిసేలా కనిపించట్లేదు.