కేవలం రెండు సినిమాలతో తనదైన ముద్ర వేసిన యువ ప్రతిభావంతుల్లో గౌతమ్ తిన్ననూరి ఒకరు. తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో మంచి పేరును పొందగా, ‘జెర్సీ’లో చూపిన అద్భుతమైన పనితనం అతన్ని అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా చేసింది. ఆ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ హిందీ రీమేక్ కూడా చేశారు. అయితే ఆ సినిమా సక్సెస్ కాలేకపోయింది.
జెర్సీ సినిమా హిందీ వెర్షన్ విడుదలకు ముందు, విడుదల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గౌతమ్ సినిమాపై చాలా పుకార్లు వచ్చాయి. గౌతమ్ డైరెక్షన్‌లో తమ హీరోని చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ వార్త నిజం కావాలని బలంగా కోరుకున్నారు కూడా.
వారికి అత్యంత ఆనందాన్ని కలిగిస్తూ ఆ వార్త నిజమైంది. రామ్‌చరణ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందని కొన్ని నెలల క్రితమే ప్రకటించారు.
ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రం అని మరియు ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మించబోతున్నారని కూడా చెప్పబడింది, అయితే కొత్తగా పొందిన పాన్-ఇండియా పాపులారిటీ మరియు ఇమేజ్ కారణంగా, రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ గురించి తన మనసు మార్చుకున్నారని అందుకే ఈ సినిమా నుంచి ఆలోచనలో పడ్డారని, ఆ రకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేయడం జరిగిందని అంతర్గత వర్గాల సమాచారం అందింది.
నిజానికి రామ్‌చరణ్ తన స్క్రిప్ట్‌ను ఇష్టపడి ఆర్‌సి15 తర్వాత సినిమా చేయడానికి కమిట్ కావడంతో కొన్ని నెలల ముందు వరకు గౌతమ్ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే రామ్‌చరణ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అంతా ఒక్కసారిగా మారిపోయింది. దాంతో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లి ఆయనకి నేరేషన్ ఇవ్వడం, విజయ్ కూడా స్క్రిప్ట్ అంగీకరించారు అనే వార్తలు వినగానే ఇక రేపో మాపో సినిమా మొదలు అవుతుందని అంతా ఊహించారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యే ముందు విజయ్ కూడా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయమని అడిగారని తాజా రూమర్స్ చెబుతున్నాయి. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండను గౌతమ్ ఎలా ఒప్పిస్తారో చూడాలి.
విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి ఇద్దరికీ గత కొన్ని రోజులుగా మంచి సమయం లేదు. ఒక వైపు విజయ్ దేవరకొండ లైగర్ వంటి భారీ డిజాస్టర్‌తో భారీ ట్రోల్‌లను ఎదుర్కొన్నారు. అయితే గౌతమ్ కొత్త సినిమాని ప్రారంభించలేక పోవడం వల్ల మనోబలం పడిపోయినట్లుగా పరిస్థితి ఏర్పడింది. మరి ఈ టాలెంటెడ్ యాక్టర్-డైరెక్టర్ జోడీ సక్సెస్ ఫుల్ సినిమాతో తిరిగి పుంజుకోవాలని ఆశిద్దాం.