యువ నటుడు తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ టచ్ తో కూడిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్ విలన్ పాత్ర చేశారు. మొన్నటి సంక్రాంతి సందర్భముగా ఆడియన్స్ ముందుకి వచ్చిన హను మాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుని రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది.
దానితో అటు ప్రశాంత్ వర్మ కు ఇటు తేజ సజ్జ కు విపరీతమైన పేరు లభించింది. అయితే దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ అనే మూవీ త్వరలో రూపొందనున్న విషయం తెలిసిందే. హను మాన్ కి మించి మరింత గ్రాండ్ లెవెల్లో ఈ మూవీని రూపొందిస్తామని ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
అయితే మొదట ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారి పేరుండగా, సడన్ ఆ ప్రాజక్ట్ చేతులు మారి ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారికి చేరింది. కారణం తెలియనప్పటికీ 2026 ప్రథమార్ధంలో జై హనుమాన్ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. త్వరలో నందమూరి మోక్షజ్ఞతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించనున్నారు ప్రశాంత్ వర్మ.