ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో హనుమాన్ పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తలకెక్కిన హనుమాన్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్ విలన్ గా కనిపించిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది.
ఇక దీనికి సీక్వెల్ గా త్వరలో జై హనుమాన్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా అందరిలో మరింత భారీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో కీలకమైన హనుమంతుని పాత్రలో నటించేందుకు కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ రానుంది. మరోవైపు లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ అప్డేట్ ప్రకారం జై హనుమాన్ మూవీలో రాముడు పాత్రధారి యొక్క అనౌన్స్ మెంట్ ని రానున్న దీపావళి రోజున ప్రకటించనున్నారట.
ఇక ఈ సినిమాను కూడా గ్రాండియర్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో మైథాలజీ యాక్షన్ మూవీగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు. కాగా త్వరలో ఈ మూవీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా టీమ్ నుండి అధికారికంగా వెల్లడి కానున్నాయి.