టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలతో బిజీబిజీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఆయన చేస్తున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్ వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
మరోవైపు దీంతోపాటు హను రాఘవపూడి తో ఒక సినిమా చేస్తున్నారు ప్రభాస్. అలానే త్వరలో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఇక వీటి తోపాటు అటు సలార్ 2 అలానే ఇటు కల్కి 2 కూడా లైన్లో ఉన్నాయి. ఈ సినిమాలన్నిటితో పాటు తాజాగా ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్.
దీనికి సంబంధించిన టెస్ట్ లుక్ షూట్ కూడా ఇటీవల జరిగింది. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించనుండగా దీని యొక్క అనౌన్స్ మెంట్ వచ్చే నెలలో రానుందట. అయితే లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ అప్ డేట్ ప్రకారం మైథలాజికల్ క్యారెక్టర్ బకాసురుడి ఆధారంగా రూపొందనున్న ఈ మూవీకి బకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసేందుకు చూస్తున్నారట.
ముఖ్యంగా ఈ సినిమా భారీ స్థాయిలో గ్రాండ్ లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనుంచి. ఇందులో ప్రభాస్ పాత్ర ఇందులో చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు ఈ సినిమాని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ వారు భారీ వ్యయంతో నిర్మించుకున్నారట. త్వరలో ఈ క్రేజీ కాంబినేషన్ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అధికారికంగా మేకర్స్ నుంచి వెల్లడి కానున్నాయి.