Homeసినిమా వార్తలుInteresting Buzz on Chiru Anil Movie చిరు - అనిల్ మూవీ పై ఇంట్రెస్టింగ్...

Interesting Buzz on Chiru Anil Movie చిరు – అనిల్ మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్ 

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తాజాగా విశ్వంభర మూవీ చేస్తున్నారు. దీనిని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట తీస్తున్న ఏ మూవీ పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఆకట్టుకునే సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుని విజయవంతం అవుతుందని  వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ అనంతరం షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మాణంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు మెగాస్టార్. 

ఇటీవల దీనిని మెగాస్టార్ స్వయంగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా పలు మీడియా మాధ్యమాల్లో కొంత ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ మూవీలో అదితిరావు హైదరి హీరోయిన్ గా నటించనుండగా భూమిక చావ్లా ఒక కీలక పాత్ర చేయనున్నారట. 

అలానే సంక్రాంతికి వస్తున్నాం మూవీలో అందరినీ అలరించిన బాలనటుడు రేవంత్ కూడా ఇందులో ఒక ముఖ్య పాత్ర చేయనున్నాడని, అలానే ఆ మూవీలో గోదారి గట్టుమీద సాంగ్ తో ఎన్నో ఏళ్ళ అనంతరం టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న  రమణ గోగుల ఇందులో కూడా ఒక సాంగ్ పడనున్నారట. 

యువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిలోరియో మ్యూజిక్ కంపోజ్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ అతి త్వరలో ప్రారంభం కానుండగా అన్ని కార్యక్రమాలు ముగించి దీనిని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.   

READ  Bollywood Beauty to Act in Allu Arjun Atlee Movie అల్లు అర్జున్ - అట్లీ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories