సాయిధరమ్ తేజ్ నటించగా వచ్చే వారం విడుదల కానున్న విరూపాక్ష సినిమా టీజర్, ట్రైలర్ చాలా బాగా రావడంతో సినిమాకి అద్భుతమైన బజ్ క్రియేట్ అయ్యింది. అద్భుతమైన స్క్రీన్ ప్లే, మంచి ట్విస్టులతో పాటు, ఎక్స్ ట్రార్డినరీ బీజీఎంతో ఈ సినిమాను తెరకెక్కించారని ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక సినిమాలోని నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న రిపబ్లిక్ చిత్రం తర్వాత సాయిధరమ్ తేజ్ మరో సీరియస్ చిత్రం అయిన విరూపాక్షతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి “ఎ” సర్టిఫికేట్ ఇచ్చి సినిమాను పెద్దలకు పరిమితం చేశారు. అయితే సినిమా కంటెంట్ లో అసభ్యకరమైన భాష, హింస లేదా లైంగిక అంశాలు దీనికి కారణం కాదు. ఈ సినిమాలో ఉత్కంఠ, భయం కలిగించే అంశాల వల్లే ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. విరూపాక్ష సినిమాలోని కంటెంట్ కు ఇలాంటి ఆంక్షలు అవసరమని తెలిసిన నిర్మాతలు కూడా సంతోషంగా ‘ఎ’ సర్టిఫికేట్ ను అంగీకరించారు.
1970-1990 మధ్య కాలంలో సాగే కథగా రూపొందిన విరూపాక్ష కు సుకుమార్ కథ అందించారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి’ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ వారు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా.. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. విరూపాక్ష ఇన్ సైడ్ రిపోర్ట్ నిజమవ్వాలని కోరుకుందాం.