ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రష్మికమందన్న హీరోయిన్ గా రూపొందిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2. ఈ మూవీపై మొదటి నుంచి అందరిలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రీ బుకింగ్స్ పరంగా చాలా ఏరియాల్లో అదరగొడుతోంది.
కాగా ఇండియన్ సినిమా హిస్టరీలో రూ. 100 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ సొంతం చేసుకున్న సినిమా లిస్ట్ చూస్తే, పాన్ ఇండియన్ భారీ చిత్రం బాహుబలి 2 ఫస్ట్ సినిమాగా రూ. 100 కోట్ల ప్రీ సేల్స్ ని సంపాదించిన మూవీగా నిలిచింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, లియో అలానే తాజాగా కల్కి 2898 ఏడి మూవీలు ఈ లిస్టులో నిలిచాయి.
ఇక ప్రస్తుతం ఈ రేర్ ఫీట్ అందుకున్న 6వ సినిమాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఈ క్లబ్లో చేరింది. ఇక మరొక రోజు రిలీజ్ కి మిగిలి ఉండగానే పుష్ప 2 మూవీ రూ. 150 కోట్ల మార్కు కూడా చేరుకునే అవకాశం కనబడుతోంది. మొత్తంగా ఓపెనింగ్ డే నెంబర్ వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ ప్రీమియర్స్ ని కలుపుకొని పుష్ప 2 మూవీ రూ. 300 కోట్ల మార్కును అందుకునే అవకాశం కూడా కనబడుతోంది. మరి అందరిలో మొదటి నుండి ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి