Homeసినిమా వార్తలుఅరుదైన అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

అరుదైన అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

- Advertisement -

పుష్ప స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సత్కరించబడ్డారు. మరియు 20 సంవత్సరాల సినిమా పరిశ్రమలో ఉన్న తర్వాత, ఉత్తరాదిలో తనకు అవార్డు రావడం ఇదే తొలిసారి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా సంపాదించి అందరి చేతా ఏకగ్రీవంగా బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకున్న పుష్ప చిత్రానికి ముందే, అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానెల్‌లలో తన తెలుగు హిట్ చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్‌ల ద్వారా చాలా మంచి ఇమేజ్‌ను సృష్టించుకున్నారు, అందువల్ల ఆయనకు దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం రావడం జరిగింది.

అయితే 2021లో అతిపెద్ద భారతీయ హిట్‌గా నిలిచిన పుష్ప బాక్సాఫీస్ విజయం వల్ల అల్లు అర్జున్ నిస్సందేహంగా పాన్-ఇండియన్ స్టార్‌గా స్థిరపడ్డారు.

CNN-News18 Indian of the Year 2022 అవార్డ్స్‌లో అల్లు అర్జున్ తన ప్రసంగంలో, పాన్-ఇండియన్ చిత్రాల యొక్క కొత్త పోకడ గురించి మాట్లాడుతూ, “ఇండియా సినిమా, ఇండియా కభీ ఝుకేగా నహిన్ (భారతీయ సినిమా, భారతదేశం ఎప్పటికీ తలవంచదు).” అంటూ సరదాగా పుష్ప: ది రైజ్ సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్‌ ను అనువదించారు.

READ  పుష్ప-2 లో ఐటెం సాంగ్ కు స్టార్ హీరోయిన్ కన్ఫర్మ్ ?

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించిన అల్లు అర్జున్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. కాగా ఆ అవార్డు అందుకున్న మొట్ట మొదటి దక్షిణ భారత నటుడు అయ్యారు. CNN News18 హోస్ట్ చేసిన ఈ అవార్డును గౌరవ మంత్రి స్మృతి ఇరానీ అల్లు అర్జున్ కు అందించారు. తన అవార్డును కోవిడ్ యోధులకు అంకితం చేస్తూ, ఇది భారతీయ సినిమా విజయం అని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ 20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నట్లు తెలిపారు. తను దక్షిణాదిలో చాలా అవార్డులను అందుకున్నానని, కానీ ఉత్తరాది నుండి అవార్డును అందుకోవడం ఇదే మొదటిసారి కాబట్టి ఇది అతనికి చాలా ప్రత్యేకమైనదని ఆయన అన్నారు. అలాగే నార్త్ సౌత్ విభజనపై కూడా వ్యాఖ్యానించారు. పుష్ప సినిమాని యావత్ భారతదేశం ఒక పండగలా జరుపుకుందని అల్లు అర్జున్ చెప్పారు. ఆ సినిమాతో అందరినీ అలరించినందుకు మరియు భారత సినీ పరిశ్రమకు సేవ చేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు.

READ  స్టార్ డైరెక్టర్లు మాత్రమే కావాలి అంటున్న తెలుగు హీరోలు

ఇక అల్లు అర్జున్ తదుపరి పుష్ప: ది రూల్ కోసం దర్శకుడు సుకుమార్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో కలిసి పని చేయనున్నారు. పుష్ప 2 సినిమా భారీ స్థాయిలో రూపొందనుంది. మరియు ప్రేక్షకులలో ఉన్న అత్యధిక అంచనాలను అందుకోవటానికి చిత్ర బృందం ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగర్త పడుతున్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories