Homeసినిమా వార్తలుAllu Arjun: అఖిల్ ఏజెంట్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్

Allu Arjun: అఖిల్ ఏజెంట్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్ కు కూడా కమిట్ అయిన ఆయన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 తర్వాత తన తదుపరి సినిమాని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇక తాజాగా వినిపిస్తున్న అంతర్గత వర్గాల వార్తల ప్రకారం అల్లు అర్జున్ దర్శకుడు సురేందర్ తో ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నారట.

రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో అల్లు అర్జున్ ను టాప్ రేసులోకి తీసుకెళ్లిన దర్శకుడు సురేందర్ రెడ్డి. కాబట్టి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం అఖిల్ తో సురేందర్ తెరకెక్కించిన ఏజెంట్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ ఏజెంట్ పాన్ ఇండియా వైడ్ గా సక్సెస్ అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.

అఖిల్ ఏజెంట్ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 28న ఏజెంట్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

READ  Pan India: అపజయాలు ఎదురైనా తెలుగు చిత్రసీమలో వరుసగా పెరిగిపోతున్న బడ్జెట్లు

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ పై గత కొన్ని రోజులుగా పెద్ద దుమారమే రేగింది. వాస్తవానికి, ఐకాన్ స్టార్ జవాన్ అనే బాలీవుడ్ సినిమాలో కింగ్ షారూఖ్ ఖాన్ తో కలిసి హిందీ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్నారు.

అయితే మళ్ళీ అందిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మోస్ట్ అవైటెడ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ అయిన్నప్పటికీ అతిథి పాత్ర చేయడం పట్ల ఐకాన్ స్టార్ అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Dasara: దసరా సినిమా పై వస్తున్న పుకార్లను ఖండించిన హీరో నాని


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories