నాని సినిమా దసరా 2023 మార్చి 30న విడుదలైంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ సినిమా అభిమానుల లిస్టులో చేరారు. నాని, కీర్తి జంటగా నటించిన సినిమా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఐకాన్ స్టార్ తన ట్విట్టర్ ఖాతాలో దసరా చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
దసరా సినిమాని అభినందించిన అల్లు అర్జున్ ఆ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన చిత్రంగా అభివర్ణించారు. నాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో తన అత్యుత్తమ నటనను కనబరిచాడని పుష్ప నటుడు అభిప్రాయపడ్డారు.
దసరా టీం మొత్తానికి బిగ్ కంగ్రాట్స్. అద్భుతంగా సినిమా తీశారు. నా సోదరుడు నాని బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. కీర్తితో పాటు ఇతర నటీనటులందరి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సంతోష్ నారాయణన్ అద్భుతమైన పాటలు మరియు గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సత్యన్ గారి అద్భుతమైన కెమెరా వర్క్.. సినిమా కెప్టెన్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నూతన దర్శకుడిగా తనని తాను అధిగమించారు. నిర్మాతలకు, సినిమాలోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. వేసవిలో నిజమైన దసరా వచ్చిందని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ధీక్షిత్ శెట్టి, సాయికుమార్, సముద్రఖని, షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సత్యన్ సూర్యన్ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.