నిన్న విడుదలైన వారసుడు ట్రైలర్ కు తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత అదే బ్యాక్ డ్రాప్ లో ఇటీవల వచ్చిన అనేక తెలుగు సినిమాలను పోలి ఉంది అని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.
నెటిజన్లు ఈ సినిమా ట్రైలర్ ను పలు ఇతర సినిమాలతో పోలుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తూ దర్శకుడు వంశీ పైడిపల్లిని ట్రోల్ చేస్తూ నిందిస్తున్నారు. ట్రైలర్ అనేక తెలుగు చిత్రాల మిశ్రమం లాగానే ఉంది కాబట్టి మనం నెటిజన్లను కూడా నిందించలేము.
వారసుడు ట్రైలర్ చూస్తే పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, మహేష్ బాబు మహర్షి, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం చిత్రాలతో పాటు గౌతమ్ ఎస్.ఎస్.సి, అల వైకుంఠపురములో, ఇంకా అనేక త్రివిక్రమ్ సినిమాల షేడ్స్ కనిపిస్తాయి.
ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక కంపెనీ దాన్ని చేజిక్కించుకోవాలనే కార్పొరేట్ విలన్, దూరంగా ఎక్కడో ఉన్న వారసుడు అయిన హీరో సీఈఓగా బాధ్యతలు స్వీకరించడం ఇవన్నీ తెలుగు ప్రజలకు ఎన్నో సినిమాల్లో చుసేసిన భావన తెప్పిస్తాయి.
వంశీ ఈ కథను మహేష్ కు ఎలా చెప్పగలిగారని మహేష్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అలాగే తమ అభిమాన హీరో ఈ స్క్రిప్ట్ ను తిరస్కరించినందుకు వారు సంతోషంగా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఈ సీఈఓ హీరోలు, రిచ్ ఫ్యామిలీ స్టోరీలతో విసిగిపోయి, కాస్త నేటివిటీ పాతుకుపోయిన కథల్లో హీరోలను చూడాలనుకుంటున్నారు.
ఇక ట్రైలర్ చాలా రోటీన్ గా ఉండడంతో పాటు జనవరి 11న ‘వారసుడు’ విడుదలవుతున్న నేపథ్యంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఇది బాగా హెల్ప్ అవుతుందని మెగా, నందమూరి అభిమానులు భావిస్తున్నారు. మరి ఏ సినిమా వల్ల ఏ సినిమాకు హెల్ప్ అవుతుందో చూద్దాం.