టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ తో ది రాజా సాబ్ అలానే హను రాఘవపూడితో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ది రాజా సాబ్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న అలానే హను మూవీ వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రభాస్ తో త్వరలో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ తీసేందుకు సిద్ధమవుతున్నారు.
వీటి అనంతరం సలార్ 2, కల్కి 2898 ఏడి 2 మూవీస్ కూడా ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. అయితే వీటితో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో పాటు టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యారు ప్రభాస్. కాగా మ్యాటర్ ఏమిటంటే, ప్రభాస్ తో త్వరలో సలార్ 2 మూవీ ప్రారంభించనున్న ప్రముఖ కన్నడ భారీ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు ఆపైన ఆయన తో మరొక రెండు మూవీస్ కలిపి మొత్తంగా తమ బ్యానర్ లో మూడు మూవీస్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
దానికి సంబంధించి హోంబలె మేకర్స్ నుండి కొద్దిసేపటి క్రితం అఫిషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. రానున్న 2026, 27, 28 లలో వరుసగా ప్రభాస్ తో తమ సంస్థ మూవీస్ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండా అవి మంచి విజయాలు సొంతం చేసుకుని తమ బ్యానర్ ప్రతిష్టని మరింతగా పెంచుతాయని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో నిర్మాత విజయ్ కిరగందుర్ తెలిపారు.