Homeసినిమా వార్తలుఅల్లు అర్జున్ - అట్లీ మూవీకి వర్క్ చేయనున్న హాలీవుడ్ కంపోజర్

అల్లు అర్జున్ – అట్లీ మూవీకి వర్క్ చేయనున్న హాలీవుడ్ కంపోజర్

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో ఒక మైథాలజికల్ సినిమా అనౌన్స్ చేశారు. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ ఆ సినిమాని నిర్మించునున్నాయి. అయితే కొన్నాళ్ళు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టిన అల్లు అర్జున్ తాజాగా అట్లీతో ఒక సినిమాని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమాని సన్ పిక్చర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఇందులో జాన్వి కపూర్, మృణాల్ ఠాకూర్, దీపికా పదుకొనే హీరోయిన్స్ గా నటించనున్నారు. అలానే మరొక హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే కూడా నటించే ఛాన్స్ ఉంది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అతిత్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సైన్స్ ఫిక్షన్ లో గ్రాండ్ లెవెల్ లో హాలీవుడ్ స్థాయిలో రూపొందునున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపుల్ రోల్ లో కనిపించనున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాకి ప్రముఖ హాలీవుడ్ కంపోజర్ హాన్స్ జిమ్మర్ సంగీతం అందించనున్నారని టాక్.

కాగా దీనికి సాయి అభ్యంకర్ సాంగ్స్ అందించనుండగా హాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించుకున్నారని అతి త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్ అధికారికంగా టీం నుంచి రానుంది సమాచారం. 

Follow on Google News Follow on Whatsapp

READ  'హిట్ - 3' ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories