Homeసినిమా వార్తలు'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు డబ్బింగ్ వర్షన్ కి హై డిమాండ్ 

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ తెలుగు డబ్బింగ్ వర్షన్ కి హై డిమాండ్ 

- Advertisement -

తాజాగా పలు ఇతర భాషల చిత్రాలు, వెబ్ సిరీస్ లు మన తెలుగులో డబ్ కాబడి ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా మంచి పేరు తెచుకుంటున్నాయి. అయితే అక్కడక్కడా కొన్ని సినిమాలు మాత్రం తెలుగు వారికి అందుబాటులోకి రావడం లేదు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ యాక్షన్ డ్రామా మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ.

ఈ మూవీని యువ దర్శకుడు అభిషన్ జీవింత్ తెరకెక్కించారు. ధర్మదాస్ అనే ఫ్యామిలీ పర్సన్ ఆర్ధిక సమస్యల రీత్యా కుటుంబాన్ని వదిలేసి శ్రీలంక నుండి ఇండియా వెళ్లిపోవడం, అనంతరం ఏమి జరిగింది అనే ఇంట్రెస్టింగ్ కథ, కథనాలతో దర్శకడు జీవింత్ దీనిని ఆకట్టుకునే రీతిన తెరకెక్కించారు.

ముఖ్యంగా ఇందులో శశికుమార్, సిమ్రాన్ ల నటనకు కూడా మంచి పేరు లభిస్తోంది. మిథున్ జై రాజ్, కమలేష్ వారి పిల్లలుగా నటించి ఆకట్టుకున్నారు. తమిళ్ లో ప్రస్తుతం థియేటర్స్ లో ఆకట్టుకుంటున్న ఈ మూవీ మొదటి వారంలో రూ. 18.7 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది.

READ  'రెట్రో' తెలుగు వర్షన్ సెన్సార్ డీటెయిల్స్

అయితే అందరినీ ఆకట్టుకుంటున్న ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేయాలనీ మన ఆడియన్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కోరుతున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకి వస్తుందనేది చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories