తమిళ స్టార్ హీరో సూర్య త్వరలో చెన్నై నుంచి ముంబైకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరియు అంతర్గత వర్గాల నివేదికల ప్రకారం, ఈ స్టార్ హీరో ముంబైలో 70 కోట్ల రూపాయల భారీ మొత్తానికి ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారని తెలుస్తోంది.
సూర్య తన భార్య జ్యోతిక మరియు పిల్లలతో చెన్నై వదిలి వృత్తి పరంగా మరిన్ని మెరుగైన అవకాశాల కోసం ముంబైకి మారాలని యోచిస్తున్నట్లు సమాచారం. నటి నగ్మా సోదరి జ్యోతికను సూర్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ దంపతులకు దియా మరియు దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నివేదికల ప్రకారం, సూర్య ముంబైలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారట. ఒక గేటెడ్ కమ్యూనిటీలో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ అపార్ట్‌మెంట్ నిర్మించబడుతుందట. కాగా ఆ గేటెడ్ కమ్యూనిటీలో కొంత మంది ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ మరియు రాజకీయ నాయకులు కూడా నివసిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక కెరీర్ విషయానికి వస్తే, సూర్య తన 42వ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్ పతాకం పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ సూర్య సరసన నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
దాదాపు పది భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా సూర్య 42 రూపొందుతోంది. కాగా షూటింగ్ సమయంలోనే ఈ సినిమా భారీ బిజినెస్ చేసిందని పలు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా యొక్క హిందీ రైట్స్, శాటిలైట్, డిజిటల్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు కూడా సమాచారం అందింది.