నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో తొలిసారిగా ఒక కొత్త పాత్రలో దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ గెటప్ తో ఉన్న లీడ్ క్యారెక్టర్స్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి సినిమా పై బలమైన క్రేజ్ ఏర్పాటు చేశాయి.
ఈ 30న దసరా టీజర్ ను ప్రేక్షకులకు కానుకగా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధం అవుతుండగా, ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ ఊహించని వార్త బయటకు రావడంతో ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దసరా సినిమా రెండు భాగాలలో ప్రేక్షకులను అలరించబోతోందని, దీనికి సంబంధించి చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని ప్రచారం జరిగింది.
అయితే ఈ రూమర్స్ పై స్పందించిన నాని దసరా కేవలం సింగిల్ పార్ట్ మూవీ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అయితే అది సింగిల్ పార్ట్ అయినా రెండు సినిమాలు లేదా అంత కంటే ఎక్కువ ప్రభావం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా దసరా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. యువ ప్రతిభావంతుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
దసరా సినిమాతో నాని తన కెరీర్ లో తొలిసారి ప్యూర్ మాస్ పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా 90వ దశకం నాటి నేపథ్యంలో సాగే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.