సినీ పరిశ్రమలో పోటీ ఉండడం అనేది కొత్తేమీ కాదు ముఖ్యంగా ఎంతో మంది స్టార్ హీరోలు, దర్శకులు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఏదేమైనా, వృత్తిపరమైన మరియు ఆరోగ్యకరమైన పోటీ ఉండటం వలన పనితీరు మెరుగుపడటానికి మాత్రమే సహాయపడతాయి. అయితే, ఒక్కో సారీ ఏర్ పోటీ వ్యక్తిగతంగా కూడా మారే అవకాశం ఉంటుంది. అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది.
దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ లో ఈ సినిమా విడుదల కావడానికి కారణం హరీష్ శంకర్ వ్యక్తిగత ఆసక్తి అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ తో తను తీయబోయే ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లడానికి హరీష్ శంకర్ చాలా కాలంగా ఎదురు చూశారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలోనూ త్రివిక్రమ్ ప్రమేయం ఉండటంతో UBS ఆలస్యానికి ప్రధాన కారణం ఆయనే అని అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. త్రివిక్రమ్ కారణంగానే పవన్ చాలా కాలంగా భగత్ సింగ్ ను పక్కన పెట్టి వేరే ప్రాజెక్టును కొనసాగించారని కూడా వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఎట్టకేలకు హరీష్ శంకర్ తన ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చేలా చేశారు. ఇప్పుడు ఎలాగైనా త్రివిక్రమ్ సినిమాకు పోటీగా తన సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంత కాలం తను ఎదురు చూసేలా చేసిన త్రివిక్రమ్ ను గట్టి దెబ్బ కొట్టి తన పంతం నెరవేర్చుకోవాలని హరీష్ శంకర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి హరీష్ శంకర్ తలపెట్టిన ఈ ప్రతీకార చర్య ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.