మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఇక ఆయన చేతిలో ఉన్నటువంటి మూడు సినిమాల్లో రెండు సినిమాల యొక్క మిగిలిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. వాటిలో రెండు సినిమాలు ఓజి మరియు హరిహర వీరమల్లు షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క తదుపరి షూటింగ్ కూడా పూర్తి చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.
ఇక విషయం ఏమిటంటే ఈ మూడు సినిమాల పై కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అలానే సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. విషయంలోకి వెళితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాల్లో ఒకటి క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణల కలయికలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పార్ట్ వన్. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని పవన్ కళ్యాణ్ పాడగా ఆ సాంగ్ ని రానున్న దీపావళి రోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మార్చి 28న సమ్మర్ కానుక విడుదల కానున్న హరి హర వీర మల్లు మూవీ భారీ బ్లాక్ బస్టర్ అందుకొని బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయమని మేకర్స్ అంటున్నారు.