పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి నటిస్తున్నారు.
ఈ మూవీలో గజదొంగ వీరమల్లు పాత్రలో పవన్ కనిపించనుండగా ఇటీవల మూవీ నుండి ఎం ఎం కీరవాణి స్వరపరిచిన రెండు సాంగ్స్ రిలీజ్ అయి బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 28 న రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజున మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ ఆడియన్స్ ముందుకి రానుండడంతో ఇది వాయిదా పడినట్లే అని తెలుస్తోంది.
త్వరలో న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. మరోవైపు ప్రస్తుతం అసెంబ్లీ సెషన్స్ లో పాల్గొంటున్న పవన్ త్వరలో ఈ మూవీ సెట్స్ లో పాల్గొననున్నారట. విషయం ఏమిటంటే, హరి హర వీర మల్లు క్లైమాక్స్ పవర్ఫుల్ గా ఉంటుందట. దాదాపుగా 40 రోజుల పాటు గ్రాండ్ గా చిత్రీకరించిన ఈ క్లైమాక్స్ సెకండ్ పార్ట్ కి మంచి లీడ్ అవుతుందని, అలానే దాని యొక్క విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా అదిరిపోయిందని టాక్.
మొత్తంగా హరి హర వీర మల్లు పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా తెరకెక్కుతోందని, రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకోవడం ఖాయం అని నిర్మాత ఏ ఎం రత్నం అంటున్నారు.