Homeసినిమా వార్తలు'హరి హర వీర మల్లు' : ఆ విషయమై ఇంకా సందిగ్ధమే

‘హరి హర వీర మల్లు’ : ఆ విషయమై ఇంకా సందిగ్ధమే

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గిస్ ఫక్రి, నోరా పతేహి, అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు.

ఇప్పటికే సాంగ్స్, గ్లింప్స్ టీజర్స్ తో మంచి ఇంట్రెస్ట్ ఏర్పరచిన ఈ సినిమా వాస్తవానికి ఈపాటికి రిలీజ్ కావాల్సింది. అయితే సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పలు ప్రీ బిజినెస్ వర్క్ పెండింగ్ కారణంగా సినిమా కొన్నాళ్లపాటు వాయిదా పడి ఫైనల్ గా న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఈ సినిమాని వచ్చే నెల 24న గ్రాండ్ లెవెల్ లో పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు టీం అఫీషియల్ గా అయితే పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ అనేకమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

READ  'హరి హర వీర మల్లు' రిలీజ్ కి సరైన డేట్స్ ఇవే 

నిజానికి ఈ డేట్ అయినా ఫిక్సేనా  లేక మళ్ళీ సినిమా వాయిదా పడుతుందా అనే అనుమానం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో నెలకొంది. ఇందులో గజదొంగ వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అందరిలో మంచి బజ్ ఏర్పరిచిన హరి హర వీర మల్లు రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో విజయవంతం అవుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp

READ  కుబేర మూవీ రివ్యూ : ఆకట్టుకునే సోషల్ డ్రామా 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories