యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తర్కెక్కిన లేటెస్ట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వం. చాలా గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల చేసినటువంటి ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. మొత్తంగా అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి కలెక్షన్ అందుకోలేకపోయింది. కావ్య ధాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శ్రీనువైట్ల మార్క్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ హంగులతో రూపొందింది. గోపీచంద్ మరొకసారి ఈ సినిమాలో తన ఆకట్టుకునే పర్ఫామెన్స్ తో అలరించారు.
ఇక ఈ సినిమాలోని కీలకపాత్రల్లో వీకే నరేష్, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, ప్రగతి తదితరులు నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన విశ్వం మూవీని చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించాయి. విశ్వం మూవీ థియేటర్స్ వద్ద దారుణమైన పర్ఫామెన్స్ అయితే చేసింది.
ఇక విషయం ఏమిటంటే తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది. మరి థియేటర్స్ లో పర్వాలేదనిపించిన విశ్వం సినిమా ఎంత మేర ఓటిటి ఆడియన్స్ అలరించి ఏ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.