ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల విరామం తరువాత తెలుగు సినీ పరిశ్రమకు పునరాగమనం చేసిన చిత్రం. అటు మెగా అభిమానులతో పాటు ఇతర సినీ ఔత్సాహికులు కూడా ఆ సినిమా పై మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఇక అందరూ ఊహించిన విధంగా, ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లలో భారీ రికార్డులను సృష్టించింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 35 కోట్ల వరకూ షేర్ వసూలు చేసింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన తదుపరి చిత్రం సైరా నరసింహా రెడ్డి తొలి రోజు 45 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగా, ఈ ఏడాది వేసవిలో విడుదలైన ఆచార్య చిత్రం కూడా తొలి రోజు 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
కానీ తాజాగా చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా విడుదలైన గాడ్‌ఫాదర్ సినిమా మాత్రం పైన ఉదాహరించిన చిత్రాల మాదిరిగా.. భారీ ఓపెనింగ్స్‌ను సాధించలేకపోయింది. కాగా మూడు రోజులలో 30 కోట్ల షేర్ మార్క్‌ను దాటింది, ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకుంటే గాడ్ ఫాదర్ చిత్రం 3 రోజుల కలెక్షన్లు ఖైదీ నంబర్ 150 మొదటి రోజు కలెక్షన్లల కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
అయితే గాడ్ ఫాదర్ మొదటిరోజుతో పోలిస్తే రెండవ రోజు, మూడవ రోజు థియేటర్లలో ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేక్షకుల సంఖ్యను నమోదు చేసింది. ఇది నిజంగా చిత్ర నిర్మాతలకు ఆనందాన్నిచ్చే విషయం.
కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మెగాస్టార్ గా కొనియాడే చిరంజీవి ఇటీవలి చిత్రాలతో లేదా ఇతర టాప్ స్టార్స్ కలెక్షన్లతో పోల్చి చూస్తే, గాడ్ ఫాదర్ సినిమా కనీసం దరిదాపుల్లో కూడా ఉండదు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం 2 వారాల పాటు నిలకడగా రన్ కావాలి. సినిమా విడుదలకు ముందే చిరంజీవి సినిమా పై చాలా మంది నమ్మకం వ్యక్తం చేశారు. అంతే కాకుండా తొలిరోజు గాడ్‌ఫాదర్ సినిమా సానుకూల సమీక్షలు మరియు మంచి టాక్ ను తెచ్చుకుని రోజురోజుకూ కలెక్షన్లలో పెరుగుదలను చూపుతోంది.
అయితే ఈ మాత్రం కలెక్షన్ల వల్ల ఈ సినిమా హిట్‌గా అనిపించుకోవడం కష్టమే. ఈ సినిమా ఈ వీకెండ్‌లో భారీ స్థాయిలో వసూళ్లు సాధించి, ఆ తరువాత రాబోయే వారం రోజులలో కూడా మంచి వసూళ్లను కొనసాగించాలి. అప్పుడే మొత్తంగా బ్రేక్ ఈవెన్ మార్కును సాధిస్తుంది.