Homeసినిమా వార్తలుభారీ ధరకు అమ్ముడైన 'ఘాటీ' నాన్ థియేట్రికల్ రైట్స్ 

భారీ ధరకు అమ్ముడైన ‘ఘాటీ’ నాన్ థియేట్రికల్ రైట్స్ 

- Advertisement -

స్టార్ నటి అనుష్క శెట్టి, వెంకట్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఏడుగురు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ పర్వాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.

ప్రధాన పాత్ర చేసిన అనుష్క శెట్టి ఈమూవీలో శీలావతి గా పెర్ఫార్మన్స్ అదరగొట్టారని, తప్పకుండా మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. వివరాల్లోకి వెళితే మొత్తంగా ఈ మూవీ యొక్క రైట్స్ రూ. 50 కోట్లకు అమ్ముడయ్యాయి.

అయితే మరోవైపు థియేట్రికల్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రూ. 10 కోట్లు, సీడెడ్ రూ. 4 కోట్లు మరియు నైజాం రూ. 7 కోట్లకు అమ్ముడుపోవడం జరిగింది. తాజాగా సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. మరోవైపు అనుష్క ఫ్యాన్స్ ఈ మూవీ పై మంచి నమ్మకం తో ఉన్నారు. దర్శకుడు క్రిష్ ఘాటీ ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని టీమ్ చెపుతోంది. 

READ  'దేవర - 2' ఆగిపోయిందా : అసలు క్లారిటీ ఇదే 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories