మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ రేపు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు.
ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. కాగా ఈ మూవీ రూ. 100 కోట్ల కలెక్షన్ మార్క్ తో ప్రారంభం కానుంది. మంచి పాజిటివ్ టాక్ కనుక లభిస్తే తెలంగాణలో రూ. 25 కోట్లు, ఆంధ్ర లో రూ. 35 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 18 కోట్లు, ఓవర్సీస్ రూ. 25 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే మూవీ పై మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదని, సెకండ్ హాఫ్ బాగుంటుందని ఇటీవల ఒక టాక్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దీనిని బట్టి అన్ని కలిసి వస్తే గేమ్ ఛేంజర్ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే డే 1 రూ. 100 కోట్లు పక్కా. ఇక మొత్తంగా ఈ మూవీ రూ. 450 కోట్ల కలెక్షన్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ చేరుకున్నట్లే. మరి ఇదంతా ఎంతవరకు పాజిబుల్ అవుతుందో తెలియాలి అంటే మరికొన్ని గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.