మెగాపవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యక్షన్ పొలిటికల్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా శ్రీకాంత్, అంజలి, ఎస్ జె సూర్య, అంజలి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇటీవల గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక తాజాగా నేడు మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. రామ్ పవర్ఫుల్ లుక్స్, స్టైల్ తో పాటు పొలిటికల్, మాస్ యాక్షన్ అంశాలు టీజర్ లో అదిరిపోయాయి. ముఖ్యంగా విజువల్స్ తో పాటు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.
యూట్యూబ్ లో అందరి నుండి మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్న గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ ఒక్కసారిగా మూవీ పై అందరిలో అంచనాలు మరింతగా పెంచేసింది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీ రానున్న 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. మరి ఈ మూవీ ఎంత మేర విజయం సాధిస్తుందో చూడాలి.