టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ భారీ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా దీనిని క్రిస్మస్ కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి పర్వాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా మూవీ నుండి రా మచ్చా మచ్చా అనే పల్లవితో సాగె మాస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. అయితే దానికి మిక్స్డ్ రిపోర్ట్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ కి సంబంధించి మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో గట్టిగా దృష్టి పెట్టాలి.
రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి ఆశించిన స్థాయి రెస్పాన్స్ లేకపోవడంతో ఇకపైన అయినా మేకర్స్ ప్రమోషన్ విషయంలో జాగ్రత్త పడాలని పలువురు చరణ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా ఈ మూవీలో ఐఏఎస్ అధికారి రామ్ నందన్ పాత్రలో చరణ్ నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, అంజలి, సునీల్, శ్రీకాంత్ నటిస్తున్నారు.