మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్మల్ ఆడియన్స్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మించారు. ఇక ఈ మూవీ భారీ అంచనాలతో రేపు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ ఓవర్సీస్ లో 900కె డాలర్స్ మార్క్ ని చేరుకుంది. అలానే అటు యుకె లో కూడా 300కె డాలర్స్ సొంతం చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మూవీ ఫస్ట్ డే ప్రీ సేల్స్ అంచనా ప్రకారం 1.4 మిలియన్ దక్కించుకునే అవకాశం ఉంది.
ఇక పాజిటివ్ టాక్ కనుక వస్తే ఈ మూవీ ఓవర్సీస్ మార్కెట్ లో ఓపెనింగ్ రూ. 25 కోట్ల కలెక్షన్ అందుకుంటుంది. మొత్తంగా ఈ మూవీ రూ. 64 కోట్ల గ్రాస్ రాబడితే బ్రేక్ ఈవెన్ అందుకున్నట్లే. మరోవైపు హిందీ బెల్ట్ లో కూడా గేమ్ ఛేంజర్ మంచి ఓపెనింగ్స్ అందుకుంటుండగా మంచి టాక్ లభిస్తే అక్కడ కూడా ఓవరాల్ బాగానే కలెక్షన్ వచ్చే అవకాశము ఉంది.