గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీపై మెగా ఫాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే ఇటీవల యూకే లో ఈ మూవీ యొక్క ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా కొద్దిసేపట్లోనే అవి రెండువేలకు పైగా టికెట్లు అమ్ముడై సెన్సేషన్ సృష్టించింది. దర్శకుడు శంకర్ ఈ సినిమా టేకింగ్ విషయంలో ఎంతో జాగ్రత్త వహించారని ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని అంటోంది టీమ్.
రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ తోపాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శంకర్ టేకింగ్, విజువల్స్ వంటివి అన్ని కూడా ఆడియన్స్ ని అలరిస్తాయి గేమ్ చేంజర్ టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలోని టెక్సా స్ లో డిసెంబర్ 21న గ్రాండ్ లెవెల్ లో నిర్వహించనున్న విషయం తెలిసిందే.