సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో అతిత్వరలో సెట్స్ మీదకు వెళ్ళమన్న భారీ గ్లోబ్ ట్రాట్టింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29. ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్న ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా సీనియర్ నిర్మాత కెల్ నారాయణ దీనిని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
దాదాపుగా రూ. 1000 కోట్లకు పైగా భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితం కానున్న ఈ మూవీలో పృధ్విరాజ్ సుకుమారన్ ఒక నెగిటివ్ పాత్ర చేయనుండగా పలువురు హాలీవుడ్ నటులు ఇందులో భాగం కానున్నట్లు తెలుస్తుంది.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా జనవరి నెలాఖరులో పక్కాగా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నారట. ఇక అక్కడ నుంచి మహేష్ బాబు, రాజమౌళిల SSMB 29 సినిమా వేగంగా షూటింగ్ జరుపుకొని 2027 మధ్యలో ఆడియన్స్ ముందుకు రానున్నట్లు చెబుతున్నారు.