Homeసినిమా వార్తలుముందు దర్శకుడు.. ఇప్పుడు హీరోయిన్ - డీజే టిల్లు సీక్వెల్ లో మార్పులు

ముందు దర్శకుడు.. ఇప్పుడు హీరోయిన్ – డీజే టిల్లు సీక్వెల్ లో మార్పులు

- Advertisement -

ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమలో భారీగా విజయవంతమైన చిత్రాలలో డీజే టిల్లు ఒకటి. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా నామమాత్రపు బడ్జెట్ తో తెరకెక్కినా.. అనూహ్యంగా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టైటిల్ రోల్ లో సిద్ధూ క్యారెక్టరైజేషన్ మరియు అతని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. అయితే అదేం చిత్రమో కానీ.. ఈ సీక్వెల్ ప్రారంభ దశలోనే కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. డీజే టిల్లు సీక్వెల్ ను ప్రకటించినప్పుడు.. తొలి భాగంలో ఉన్న అదే తారాగణం మరియు సిబ్బందిని కలిగి, చక్కని ఆసక్తితో పాటు మంచి సందడితో ప్రారంభమైంది. ఐతే కొన్ని సృజనాత్మక విభేదాల కారణంగా ఈ సినిమా నుండి దర్శకుడు విమల్ కృష్ణ కొంత కాలం ముందు వైదొలిగారు.

కాగా తొలి భాగంలో నేహా శెట్టి స్థానంలో కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీలీల కూడా విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. మరో వైపు ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

READ  సౌత్ ఇండస్ట్రీల ముందు వెలవెలబోతున్న బాలీవుడ్

కాగా ముందుగా ఈ సీక్వెల్ నుండి తప్పుకున్న తర్వాత, దర్శకుడు విమల్ కృష్ణ ఇప్పుడు నాగ చైతన్యతో ఒక చిన్న బడ్జెట్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసి నాగ చైతన్యకు కథ వినిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

కాగా విమల్ కృష్ణ స్థానంలో ‘అద్భుతం’ దర్శకుడు మాలిక్ రామ్‌ని డీజే టిల్లు సీక్వెల్‌ తెరకెక్కించేందుకు ఎంపిక చేశారు. అద్భుతం చిత్రంలో తేజ సజ్జ, శివాని రాజశేఖర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేరుగా OTTలో డిస్నీ+హాట్ స్టార్ ప్లాట్ ఫారంలో విడుదలైంది. అంతే కాకుండా టైటిల్ కు తగ్గట్టే అద్భుతమైన విధంగా తెరకెక్కించారని భారీ ప్రశంసలు అందుకుంది.

ఇక పైన డీజే టిల్లు సీక్వెల్ సిబ్బందిలో, నటీనటులలో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా ఈ క్రేజీ బ్లాక్ బస్టర్ చిత్రం యొక్క రెండో భాగం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  US ప్రీమియర్లలో వన్ మిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా పొన్నియిన్ సెల్వన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories