Homeసినిమా వార్తలుడిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన ఫస్ట్ డే ఫస్ట్ షో

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన ఫస్ట్ డే ఫస్ట్ షో

- Advertisement -

ఇటీవలే ఫస్ట్ డే ఫస్ట్ షో అనే ఓ చిన్న సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ ఈ సినిమాకి కథను అందించడమే కాకుండా విస్తృతంగా ప్రచారం కూడా జరిపారు. అందువల్ల విడుదలకు ముందు సినిమాకు మంచి బజ్ వచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ చిత్రం థియేటర్ల లో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

పవన్ కళ్యాణ్ సినిమా కోసం టికెట్ సంపాదించడం అనే చిన్న పాయింట్ మీద సినిమా తీయాలి అనుకున్న దర్శకుడి ప్రయోగం బెడిసి కొట్టింది. అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించినప్పటికీ.. మిగతా సినిమా అంతా చాలా పేలవంగా ఉండి ప్రేక్షకులను నిరాశపరిచింది. పైగా సినిమా అంతా పవన్ కళ్యాణ్ మీద ఆయన క్రేజ్ మీద నడిపించడంతో ఆయన అభిమానులు థియేటర్ల వద్దకు పరిగెత్తుకు వస్తారని చిత్ర బృందం ఆశించి ఉంటుంది. కాగా ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ రకంగా మెగా అభిమానుల అండ ఈ సినిమాకి ఉంటుందేమో అని ట్రేడ్ వర్గాలు కూడా అనుకున్నాయి.

అయితే సినిమాలో విషయం ఉన్నప్పుడే మెగా అభిమానులయినా, ఇతర హీరో అభిమానులయినా మద్దతు ఇవ్వగలరు కానీ సినిమాలో సరైన కంటెంట్ లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు అన్నది నిజం. పైగా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా విడుదలయిన సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తమ్ముడు, జల్సా సినిమాల ప్రత్యేక ప్రదర్శనలతో చాలా బిజీగా ఉన్నారు. అందువల్ల వారు కనీసం ఓపెనింగ్స్ లో కూడా ఈ చిత్రానికి సహాయం చేయలేకపోయారు.

READ  కార్తీకేయ-2 ఓటిటి రిలీజ్ డీటైల్స్

ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంతటి డిజాస్టర్ గా నిలచింది అంటే.. కనీసం మొదటి రోజున కూడా చాలా ధియేటర్లలో కనీస స్థాయిలో ప్రేక్షకుల సంఖ్య నమోదు కాలేదు. ఇక థియేటర్లలో భారీ పరాజయం పాలైన తర్వాత ఈ చిత్రం OTT రిలీజ్ కు సిద్ధం అవుతుందని తాజా సమాచారం. ఈ చిత్రం సెప్టెంబర్ 23 నుండి ఆహా ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది.

ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా విడుదలై సరిగ్గా మూడు వారాలు అవుతోంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ కు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నూతన నటీనటులు శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసు ప్రధాన పాత్రలు పోషించారు. పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా మొదటి రోజు ఫస్ట్ షో టిక్కెట్ల కోసం ఒక యువకుడు తన ప్రేమను మెప్పించడానికి ఎంత కష్టపడ్డాడనేదే ఈ చిత్ర కథ. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి ఈ సినిమా లో కీలక పాత్రలు పోషించారు.

READ  Box-Office: ఈ వారం తెలుగు సినిమాల రిపోర్ట్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories