Homeసినిమా వార్తలుOTT విడుదలకు సిద్ధమైన బింబిసార

OTT విడుదలకు సిద్ధమైన బింబిసార

- Advertisement -

థియేటర్లలో విడుదలై రెండు నెలలు పైన గడిచిపోయిన కల్యాణ్ రామ్ బింబిసార చిత్రం తాజాగా OTT ప్లాట్‌ఫారమ్ Zee 5లో త్వరలో విడుదల అవడానికి సిద్ధంగా ఉంది.

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బింబిసార’. వశిష్ఠ మల్లిడి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ తన నటనకు చక్కని ప్రశంసలు అందుకున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5 తేదీన రిలీజై.. బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు రూ.75కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాలా కాలంగా సరైన హిట్ లేని కళ్యాణ్ రామ్ కి ఈ చిత్రం భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రేమికులు అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇక వారి ఎదురుచూపులు తెర పడినట్లే. OTTలో బింబిసార విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటిటి సంస్థ Zee5 దసరా రోజున లేదా అక్టోబర్ 10వ తారీకు నుండి సినిమాను ప్రసారం చేస్తుందని రకరకాల వార్తలు వచ్చాయి.అయితే, ఈ OTT దిగ్గజం ఫాంటసీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన బింబిసార చిత్రాన్ని అక్టోబర్ 21 నుండి తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానుందని అధికారికంగా వెల్లడించింది.

READ  ఓటీటీలో విడుదలయిన విక్రమ్ కోబ్రా సినిమా

కాగా ఆసక్తికరమైన కథతో వచ్చిన బింబిసార చిత్రం మొదటి రోజు నుండి సానుకూల సమీక్షలతో పాటు అద్భుతమైన కలెక్షన్లను కూడా సాధించింది. మరియు వ్యాపారంలో పాల్గొన్న వారందరికీ మంచి లాభాలను కూడా అందించింది. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్ లతో పాటు వివాన్ భటేనా కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ సినిమాని నిర్మించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఇండియన్-2 బడ్జెట్ లెక్కింపుల వలన కోట్లు నష్టపోయిన దిల్ రాజు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories