దర్బార్ సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్ తన కెరీర్ లో లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. నిజానికి ఆయన విజయ్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు కానీ అది కార్యరూపం దాల్చలేదు, ఆ తర్వాత మరికొన్ని ప్రాజెక్టుల కోసం కూడా ప్రయత్నించారు కానీ ఏదీ ఆయనకు అనుకూలంగా వర్కవుట్ కాలేదు.
అయితే తాజాగా మురుగదాస్ తమిళ యువ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. తెలుగు, తమిళ , హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం పై కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుందట.
సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి సినిమాలు తీయడంలో మురుగదాస్ దిట్టగా పేరు పొందారు. ఆయన కెరీర్ లో దీనా, గజిని, తుపాకి, కత్తి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆ తర్వాత మురుగదాస్ వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కొని దర్బార్ పరాజయం తర్వాత సినిమాలేవీ స్టార్ట్ చేయలేదు. తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ఆయన ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకులలో ఏఆర్ మురుగదాస్ ఒకరు. గతంలో పాన్ ఇండియా లెవల్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అందరు సూపర్ స్టార్లు తమ కెరీర్ లో ఒకానొక సమయంలో మురుగదాస్ తో పనిచేయడానికి ప్రయత్నించారు.
సూర్యతో గజిని చేసిన మురుగదాస్, ఆ తర్వాత హిందీలో అమీర్ ఖాన్ తో ఆ సినిమా రీమేక్ చేశారు. 7 అం అరివు’ (7థ్ సెన్స్), దళపతి విజయ్ తో ‘తుపాకి’ చిత్రాన్ని తీసి మళ్ళీ అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ తో ‘హాలిడే’గా రీమేక్ చేశారు. ఒకానొక సమయంలో ఏఆర్ మురుగదాస్ మరియు బ్లాక్ బస్టర్స్ పర్యాయపదాలుగా ఉండేవి.
ఏఆర్ మురుగదాస్, శివకార్తికేయన్ ల సినిమా అనేది కేవలం వార్త కాకుండా నిజంగా సినిమా ఉంటుందని.. ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఈ సినిమాతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాం.