వాల్తేరు వీరయ్య వంటి భారీ విజయం తర్వాత మెగా స్టార్ చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గాడ్ ఫాదర్, ఆచార్య వంటి సీరియస్ సినిమాలకు దూరంగా ఉంటూ తన సినిమాలకు మరింత ఎంటర్ టైన్ మెంట్ వాల్యూ జోడించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆచార్య ఫెయిల్యూర్ కారణంగా చిరంజీవి స్టార్ డైరెక్టర్లకు దూరంగా ఉంటూ ప్రతి విషయంలోనూ తన ఇన్ పుట్ తీసుకునే కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది.
ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ తో కూడా సూపర్ హిట్ అందించాలని మెగా స్టార్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఎంటర్ టైన్ మెంట్ డోస్ పెంచేలా కొన్ని పార్ట్స్ పై చిత్ర బృందం రీవర్క్ చేస్తున్నారట. భోళా శంకర్ టీం కొన్ని పోర్షన్స్ రీడిజైన్ చేయగా, చిరంజీవి తన సక్సెస్ ఫామ్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు.
ఇలా చాలా సమయం తీసుకుని పలు స్క్రిప్ట్ లు విన్న చిరంజీవి ఎట్టకేలకు తన తదుపరి సినిమా కోసం బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్టను ఓకే చేశారట. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న చిన్న దర్శకులతో పనిచేయాలన్న మెగా స్టార్ ప్లాన్స్ కు ఈ ప్రాజెక్ట్ సరిగ్గా సరిపోతుంది అనే చెప్పాలి. మరి ఆయన నిర్ణయం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో లేదో చూద్దాం.