అక్కినేని మూడవతరం వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సురేందర్ 2 సినిమాస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన గ్రాండియర్ స్పై యాక్షన్ మూవీ ఏజెంట్. ఈ మూవీలో అందాల నటి సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా కీలకపాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కనిపించారు.
2023 ఏప్రిల్ 28న మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలై డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా సురేందర్ రెడ్డి కథ, కథనాలు టేకింగ్ పై ఆడియన్స్ నుండి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. అయితే నటుడిగా అఖిల్ అక్కినేని అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచారు.
ఈ మూవీకి హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన సాంగ్స్ కూడా బాగానే అలరించాయి. కాగా అప్పటి నుంచి కూడా ఈ సినిమా యొక్క ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూడసాగారు, నిజానికి ఈమూవీ యొక్క ఓటిటి రైట్స్ ని సోనీ లివ్ వారు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం వాయిదా పడుతూ వచ్చింది.
కాగా ఫైనల్ గా ఏజెంట్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏజెంట్ మూవీని మార్చి 14 నుంచి ప్రముఖ ఓటీపీ మాధ్యమం సోనీ లివ్ ద్వారా ప్రసారం చేయనున్నారు.. దీనికి సంబంధించి తాజాగా ఆఫీషియల్ అప్డేట్ అయితే లభించింది. మరి థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమా ఎంతమేర ఓటీటీలో మెప్పిస్తుందో చూడాలి