Homeసినిమా వార్తలుప్రభాస్ బర్డ్ డే రోజు ఫ్యాన్స్ ట్రిపుల్ హంగామా

ప్రభాస్ బర్డ్ డే రోజు ఫ్యాన్స్ ట్రిపుల్ హంగామా

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను వారి పుట్టినరోజుకి మళ్లీ విడుదల చేసే ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే . ఇటీవలే ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాని విడుదల చేసుకుని మహేష్ అభిమానులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. ఇక వారికి మేమేమీ తక్కువ కాదు అంటూ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు జల్సా విడుదల చేస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర మరియు ఘరానా మొగుడు చిత్రాలను కూడా మళ్లీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ప్యాన్ ఇండియా స్టార్ మరియు యంగ్ రెబెల్ ప్రభాస్ అభిమానులు ఊరికే ఉంటారా.. వాళ్ళు కూడా ఈ ట్రెండ్ లో పాల్గొంటూ తమ అభిమాన హీరో పుట్టిన రోజున ప్రత్యేక షోలను ఏర్పాటు చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కోసం ఒకటి కాదు ఏకంగా మూడు సినిమాలను తిరిగి విడుదల చేయడానికి అతని అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభాస్ పుట్టిన రోజు నాడు వర్షం, మిర్చి, ఛత్రపతి సినిమాల ప్రత్యేక షోలు ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారట.

వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిన సినిమా. ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా సాధారణంగా సినీ ప్రేమికులకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రభాస్ ను టాలీవుడ్‌లో స్టార్ హీరోగా నిలబెట్టిన ఈ సినిమాలో ప్రభాస్ – త్రిషల జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా విడుదలై దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా దేవిశ్రీప్రసాద్ అందించిన ఎవర్గ్రీన్ సంగీతం మరియు సినిమాని ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేదు.

READ  సమ్మర్ రిలీజ్ కన్ఫర్మ్ అంటున్న సూపర్ స్టార్

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమా ప్రభాస్ ను ఒక మాస్ యాక్షన్ హీరోగా నిలబెట్టింది. అంతే కాకుండా భావోద్వేగాలతో కూడుకున్న ప్రభాస్ నటన, వీరోచితంగా చేసిన పోరాట సన్నివేశాలు ఇప్పటికీ అందరూ అంతే ఆసక్తిగా చూస్తారు. ప్రభాస్ అభిమానులకు మరియు మాస్ ప్రేక్షకులకు ఇదే ఫేవరెట్ సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చివరిగా మిర్చి సినిమా.. దర్శకుడు కొరటాల శివ తొలి చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ ను అటు సూపర్ స్టైలిష్ గా ఇటు ఊర మాస్ టచ్ లో చూపించారు. పక్కా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న మిర్చి సినిమా ఆ సమయానికి ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ యొక్క స్టైలిష్ లుక్స్ మరియు ఉర్రూతలూగించే ఫైట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

Follow on Google News Follow on Whatsapp

READ  మళ్ళీ వాయిదా పడిన కార్తీకేయ -2


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories